అమరావతి : ఏపీలోని టీడీపీ(TDP) ప్రధానకార్యాలయంపై దాడిచేసిన కేసులో వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishnareddy) మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు విచారకు హాజరయ్యారు. ఈ కేసులో సజ్జల 120వ నిందితుడిగా ఉన్నారు. పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని రెండురోజుల క్రితం మంగళగిరి పోలీసులు సజ్జల కు నోటీసులు (Notice) అందజేశారు. గురువారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సజ్జల వెంట న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu Sudhakar reddy) , వైసీపీ నాయకులు బ్రహ్మారెడ్డి, అప్పిరెడ్డిలు ఉన్నారు.
అయితే న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు సజ్జల ఒక్కరే విచారణకు లోనికి వెళ్లారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు సజ్జలను విచారించారు.
కాగా సజ్జల విచారణకు వచ్చిన సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అవినాష్, నందిగంసురేష్ను పోలీసులు విచారించారు.