అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా కార్టూనిస్టు శ్రీధర్‌ను నియమించడం వివాదాస్పదం అవుతోంది. ఈ నియామకంపై ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాడు ఎన్టీ రామారావును కించపరిచేలా ఈనాడులో కార్టూనిస్టు శ్రీధర్ పలు కార్టూన్లు వేయడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా కొలిచే ఎన్టీ రామారావు మీద ఈనాడు పేపర్లో కార్టూనిస్ట్ శ్రీధర్ నీచమైన కార్టూన్లు వేశాడని ఆయన అభిమానులు గుర్తుచేస్తున్నారు. అలాంటి కార్టూనిస్టుకు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని ఛీ అంటూ చీదరించుకుంటున్నారు.
వివాదాస్పదం అవుతున్న కార్టూనిస్ట్ శ్రీధర్ ప్రభుత్వ సలహాదారు నియామకం
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా కొలిచే ఎన్టీఆర్ మీద ఈనాడు పేపర్లో నీచమైన కార్టూన్లు వేసిన కార్టూనిస్ట్ శ్రీధర్
అలాంటి కార్టూనిస్టుకు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడంపై ఛీఛీ అంటూ చీదరించుకుంటున్న ఎన్టీఆర్… pic.twitter.com/C4ShmAuJCD
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2025