అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య( Annamaiah District ) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పీలేరు మండలం బాలమువారిపల్లి వద్ద కారు( Car ) అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక( Karnataka) రాష్ట్రాం చింతామణికి చెందిన లోకేష్, శివన్నర, సునీల్,తిప్పారెడ్డి, గంగులయ్య, అనే వ్యక్తులు పీలేరులో జరుగుతున్న క్యాటరింగ్ పనులకు బయలు దేరారు.
ఆదివారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ పొలాల్లో ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివన్న, గంగులయ్య, లోకేష్ మృతి చెందగా సునీల్, తిప్పారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.