అమరావతి : విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృత్యువాత పడ్డారు. పూసపాటిరేగ జాతీయరహదారిపై శ్రీకాకుళం ( Srikakulkam ) నుంచి విశాఖకు వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు పాదచారులను ఢీ కొట్టిన అనంతరం లారీని బలంగా తాకింది. దీంతో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడ్డ ఇద్దరిని విజయనగరం ఆస్పత్రిలో చేర్పించారు. మృతులు సింహాచలం, శ్రీనివాస్గా గుర్తించారు. మరో ఇద్దరు వివరాల కోసం సమాచారాన్ని సేకరిస్తున్నారు.