అమరావతి : విజయవాడ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నగరంలోని పాతరాజరాజేశ్వరిపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలను ఢీ కొట్టింది. అనంతరం కారు గోడను ఢీ కొట్టి ఆగిపోయింది . ఈ ప్రమాదంలో షకీల్ అనే బాలుడు మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పిల్లలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటన జరుగగానే కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోగా కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.