ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో దాదాపు తెలిసిపోయింది. వచ్చే నెల 11న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎవరెవర్ని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరెవరికి ఉద్వాసన పలకాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి సీఎం జగన్ శ్రీరామ నవమి రోజే మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. నిజానికి శ్రీరామ నవమి పదో తారీఖు వస్తోంది. జగన్ మాత్రం తన మంత్రివర్గాన్ని 11న విస్తరించాలని డిసైడ్ అయ్యారు. సీఎం జగన్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో వచ్చే నెల 8 న భేటీ కానున్నారని తెలుస్తోంది. ఆ సమావేశంలోనే మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ గవర్నర్‌కు పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు.