Chandrababu | ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి : సీఎం చంద్రబాబు
Chandrababu | ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నబ్ తుఫాన్ (Cyclone Arnab ) కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు ( Chandrababu ) అధికారులను ఆదేశించారు. తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి యంత్రాంగం ,సిబ్బంది వరకు బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆర్నబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 5 వేల హెక్టార్లలో అరటి పంట, 8 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను కేంద్రానికి వివరించడంతో పాటు, పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని తెలిపారు. ఎక్కడైనా ప్రాణనష్టం సంభవించిందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు సీఎంకు నివేదించారు. చెరువులు పొంగిపొర్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సాగునీటి సంఘాలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. తుఫాన్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారిని పరిస్థితులు పూర్తిగా కుదుటపడిన తర్వాతే ఇళ్లకు పంపాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venu Udugula | తెలంగాణ సంస్కృతిని కేవలం ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి: దర్శకుడు వేణు ఉడుగుల!
Chandrababu | ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి : సీఎం చంద్రబాబు
Jio IPO | స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఎంట్రీ.. 21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్..!
Trivikram | శ్రీనిధి శెట్టి పాదాలకు త్రివిక్రమ్ నమస్కారం.. ‘ఆదర్శ కుటుంబం’ వేడుకలో అసలేం జరిగింది?
Stock Markets | భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. చమురు ధరల మంటలే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

