మోదీ ప్రభుత్వాన్ని దించండి.. దేశాన్ని రక్షించండి : సీతారాం ఏచూరి
CPM | కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహి స్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
అమరావతి : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. విజయవాడలో దేశ రక్షణ భేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని అన్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్లకి రూ. 13 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఏడేళ్లలో అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చారని విమర్శించారు.
కార్పొరేట్లకి రాయితీలు ఇచ్చికేంద్రం సామాన్యుల నడ్డివిరుస్తోందని వెల్లడించారు. మోదీ ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వం నిలదీయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రూ. 36 వేల కోట్ల నిధులు కేంద్రం ఇవ్వ లేదని అన్నారు. బీజేపీ పార్టీలోకి రాని వారిపై ఈడిచే దాడులు చేయిస్తుందని ఆరోపించారు. బీజేపీ అధి కారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు ఎక్కువైపోయాయని అన్నారు.
భారతదేశాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు ముందుకొచ్చే వారితో కలిసి పనిచేద్దామని పేర్నొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

