BR Naidu | టీటీడీ పాలక మండలి 54వ చైర్మన్‌గా (TTD Chairman) బీఆర్ నాయుడు (BR Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ నాయుడు, 16 మంది పాలక మండలి సభ్యులతో ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు. అనంతరం వారంతా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడే అధికారులు స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు.
#WATCH | Andhra Pradesh: BR Naidu took oath as the 54th chairman of the board of trustees of the Tirumala Tirupati Devasthanams (TTD) at the Sri Venkateswara Temple, Tirumala. pic.twitter.com/fgvy9MbXad
— ANI (@ANI) November 6, 2024
కాగా, కూటమి ప్రభుత్వం టీటీడీ (Tirumala Tirupati Devasthanams) బోర్డు సభ్యుల జాబితాను వారం రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. చైర్మన్‌తో సహా మొత్తం 25 మంది సభ్యులతో పాటు మరో నలుగురు అధికారులను ఎక్స్అఫిషియో (Ex-Officio) సభ్యులుగా నియమించింది. బీఆర్ నాయుడు మంగళవారం రాత్రి తిరుమలకు(Tirumala) చేరుకున్నారు. చైర్మన్‌గా రాక సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ పాలక మండలిలో ఏపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.
తెలంగాణ(Telangana) లో వివిధ రంగాలకు చెందిన ఐదుగురికి, కర్ణాటకకు చెందిన ముగ్గురిని, తమిళనాడుకు చెందిన ఇద్దరిని నియమించారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటేశ్వరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి , నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్ఎన్ దర్శన్, జస్టిస్ హెచ్ఎల్ దత్ , శాంతరామ్ , రామ్మూర్తి , తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్‌కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరబ్ హెచ్. బోరా,బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ రెడ్డిలను సభ్యులుగా నియమించారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. 358గా ఏక్యూఐ నమోదు
Allu Arjun | అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. కేసు కొట్టేసిన న్యాయస్థానం
Raja Krishnamoorthi | ఇల్లినాయిస్లో భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి విజయం