ఈ సాయంత్రానికల్లా ఉద్యోగుల సమస్యకు పరిష్కారం: మంత్రి బొత్స
ప్రభుత్వ ఉద్యోగులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో దఫా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి...
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో దఫా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఇవాళ సాయంత్రానికల్లా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ శ్లాబ్‌ల తర్వాత ఉద్యోగుల జీతాల నుంచి ఐఆర్‌ను రికవరీ చేయడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అన్ని అంశాలపై చర్చ జరుగుతుందని, తమది స్నేహపూర్వక ప్రభుత్వమని మంత్రి పునరుద్ఘాటించారు. శుక్రవారం నాటి చర్చల్లో ఉద్యోగులు తమకు విన్నవించిన సమస్యలను సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులు ఆందోళన విరమించుకునేందుకు వారి సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని, వారి సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపేందుకు కృషి చేస్తామన్నారు. తాము కోరుతున్న కొన్ని కీలక అంశాలపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని, చర్చలు సఫలమయ్యేలా కొనసాగుతున్నాయని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, శనివారంకల్లా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

