AP News | వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు మరోసారి రిమాండ్ పొడిగించింది. మరో 14 రోజుల రిమాండ్ విదిస్తూ గుంటూరు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నవంబర్ 12వ తేదీ వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అనిల్ ఉండనున్నారు.
గుంటూరులో కర్లపూడి బాబు ప్రకాశ్ అనే వ్యక్తిని రూ.50 లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలతో బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మూడు రోజుల కస్టడీ ఇవ్వడంతో అనిల్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. తాజాగా ఆ కస్టడీ ముగియడంతో మళ్లీ గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం మరో 14 రోజుల రిమాండ్ విధించింది.
తనను కావాలనే కేసులో ఇరికించారని ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ కుట్ర అని అన్నారు. దళితుడిని కాబట్టే వ్యక్తిత్వ హననం చేశారని వాపోయారు. కోర్టు ద్వారా అందరికీ సమాధానం చెబుతానని స్పష్టం చేశారు.