Bhanu Prakash Reddy | జగన్ ఢిల్లీలో కాదు.. చంద్రమండలంలో ధర్నా చేయాలి.. బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి సెటైర్లు
Bhanu Prakash Reddy | వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కాదు.. చంద్రమండలంలో ధర్నా చేయాలని అని ఎద్దేవా చేశారు.
Bhanu Prakash Reddy | వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కాదు.. చంద్రమండలంలో ధర్నా చేయాలని అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలని కోరాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన దాడులు, దారుణాలపై ఈ ధర్నాలో చెప్పాలని అన్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ప్రజలపై జరిగిన దాడులను లోకమంతా చూసిందని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళన ప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌కే దక్కిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో శాంతి వాతావరణం కల్పించిందని తెలిపారు. కక్ష సాధింపులు కాదని.. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌వైపు అడుగులు వేస్తుందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన అరాచకాలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు జగన్ మసిపూసి మారేడుకాయ చందంగా తమ మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. విధ్వంసం చేసిన ఏ నాయకులను వదిలిపెట్టమని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

