
Purandeswari with Bhuvaneswari | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కించపర్చడం పట్ల బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఖండించారు. తన సోదరి భువనేశ్వరికి ట్విట్టర్ వేదికగా సంఘీభావం ప్రకటించారు. వ్యక్తిత్వ హననం సహేతుకం కాదని చెప్పారు. ఎన్టీఆర్ కూతుళ్లుగా తాము నైతిక విలువలతో పెరిగామని, విలువలపై రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చేశారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదన్నారు. భువనేశ్వరికి నందమూరి కుటుంబం సంఘీభావం ప్రకటించింది.
శుక్రవారం అసెంబ్లీలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదం మధ్యలో అధికార పార్టీ నేతలు తన సతీమణి భువనేశ్వరిని కించపరిచే వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు కన్నీటి పర్యంతం అయ్యారు. తర్వాత టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోనూ అసెంబ్లీలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ వెక్కివెక్కి ఏడ్చారు.