అమరావతి : ఏపీలో వైసీపీకి బిగ్ షాక్(Big Shock) తగిలింది. ఒంగోలుకు చెందిన వైసీపీకి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా(Resign) లేఖను వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మంత్రిగా పనిచేశానని వెల్లడించారు.
కొన్ని కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాష్ట్రం ప్రగతిపథంలో రాజకీయాలకు అతీతంగా పయనిస్తే అభినందిస్తానని అన్నారు. రాజకీయంలో రాజకీయాలు వేరు, బందుత్వం వేరని వెల్లడించారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడూ తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు.
రాజకీయాలోల భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలని, రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సహాయం కోసం తన వద్దకు వచ్చినా వారికి రాజకీయాలకు అతీతంగా సేవలందించానని తెలిపారు. బాలినేని రేపు జనసేన అధినేత,డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి త్వరలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.