Bhavani Deeksha : ఈ నెల 15 నుంచి భవానీ మండల దీక్షధారణలు
Bhavani Deeksha : భవానీ మండల దీక్షధారణలు ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్టు దుర్గగుడి పాలకమండలి చైర్మన్ సోమినాయుడు తెలిపారు. కొవిడ్ నిబంధనలు...

విజయవాడ : (Bhavani Deeksha) భవానీ మండల దీక్షధారణలు ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్టు దుర్గగుడి పాలకమండలి చైర్మన్ సోమినాయుడు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు భవానీ దీక్షలకు సంబంధించిన పోస్టర్లును ఆయన ఆవిష్కరించారు.
ఈ సంవత్సరం 8-9 లక్షల మంది భవానీ దీక్షలు తీసుకుంటారని అంచనా వేస్తున్నట్లు సోమినాయుడు తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తులు కూడా మార్గదర్శకాలను పాటించి సహకరించాలని ఆయన సూచించారు. భక్తులకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. ఉచిత భోజన వితరణకు ఏర్పాట్లు చేస్తున్నామని సోమినాయుడు పేర్కొన్నారు.
దీక్షధారణల వివరాలు
ఈ నెల 15 నుంచి భవానీ మండల దీక్షధారణలు మొదలవుతాయి. 15 నుంచి 19 వరకు దీక్షధారణలు కొనసాగుతాయి. డిసెంబరు 5 నుంచి 9 వరకు భవానీ అర్ధమండల దీక్షలు ఉంటాయి. డిసెంబరు 18న సాయంత్రం 6.30 గంటలకు కలశజ్యోతి ఉత్సవం జరుగుతుంది. డిసెంబరు 25 నుంచి 29 వరకు శతచండీయాగం, గిరిప్రదక్షిణలు ఉంటాయి. డిసెంబరు 25 నుంచి 29 వరకు భవానీ దీక్షల విరమణ జరుగుతుంది. డిసెంబరు 29న ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి భవానీ దీక్ష విరమణ కార్యక్రమాన్ని చేపడతారు. ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయంలో దర్శనాలు ఉంటాయి. ఉచిత దర్శనం, రూ.100 టికెట్లు ఆన్లైన్లో పొందేందుకు ఏర్పాట్లు చేశారు.
భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో
భవానీలు వస్త్రాలు వదిలేసేందుకు కేశఖండనశాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరి ప్రదక్షిణల కోసం కలెక్టర్ అనుమతికి నివేదించినట్లు ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అబ్బురపరిచే జ్ఞాపకశక్తి ఈ చిన్నారి సొంతం..
రైతుల పాదయాత్రను ఆపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది: చంద్రబాబు
సిక్కోలు చిరకాల స్వప్నం నెరవేరుతుంది : ధర్మాన ప్రసాదరావు
వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వాలి: వెంకయ్యనాయుడు
పాపికొండలకు పద పద పద.. బోట్ యాత్ర షురూ!
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

