అమరావతి : విజయవాడలోని (Vijayawada) ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో రేపటి నుంచి డిసెంబర్ 25 వరకు భవానీ దీక్షలు (Bhavani Dikshas) ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 7 గంటలకు భవానీ మండల దీక్షాధారణలతో ప్రారంభమై కార్తీక పౌర్ణమి రోజు దీక్షాధారణలు ముగుస్తాయి. డిసెంబర్ 1న భవానీ అర్థ మండల దీక్షాధారణలు ప్రారంభమై 5 వ తేదీన ముగుస్తాయి.
డిసెంబర్ 14 న కలశ జ్యోతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 21 నుంచి 25వ తేదీవరకు దీక్ష విమరణలు ఉండనున్నాయని వివరించారు. అదే రోజు మహా ఫూర్ణాహుతితో భవానీ దీక్షలు సమాప్తమవుతాయని పేర్కొన్నారు. భవానీ దీక్షలు ప్రారంభం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.