అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిం చారు. కొందరి వ్యవహారం వల్ల పోలీసు శాఖకు తలవంపులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసిన ఎంపీలను కొందరు పోలీసులు సమర్ధిస్తున్నారని మండిపడ్డారు. నిందితులకు పోలీసులు బహిరంగం గా మద్దతు ఇవ్వడం దారుణమని, నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులను బనా యించడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసుశాఖ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని పేర్కొన్నారు.