తిరుమల : తిరుమల ( Tirumala ) లో భక్తుల సౌకర్యార్దం ఓ భక్తుడు టీటీడీ బ్యాటరీ బగ్గీ ( Battery Bugg) ని విరాళంగా అందజేశారు. కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు చెందిన హైడ్రోకార్ట్ టెక్నో సొల్యూషన్స్ సంస్థ ఎండీ గణేష్ జయవేల్ రూ.10 లక్షలు విలువైన బ్యాటరీ బగ్గీ వాహనాన్ని విరాళంగా అందించారు.ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను పేష్కార్ రామకృష్ణకు అందజేశారు .
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
భక్తగ్రేసరుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తీరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 23 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 79,426 మంది భక్తులు దర్శించుకోగా 25,889 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.98 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.