అమరావతి : విశాఖ పట్నంలో బరోడా మహిళా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. విశాఖలో జరుగుతున్న టీ 20 మ్యాచ్ను ముగించుకుని ఎయిర్పోర్టుకు వెళ్తున్న బరోడా మహిళల సీనియర్ జట్టు ప్రయాణిస్తున్నబస్సు తాటిచెట్లపాలెం జాతీయ రహదారి జంక్షన్ వద్ద ముందు ఉన్న లారీ వేయడంతో ఢీ కొట్టింది. బస్సులో ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న కంచెరపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు వెల్లడించారు.