హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారికి ఆదివారం భారీ విరాళం అందింది. బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపార సంస్థ టీటీడీకి రూ.1.50 కోట్లు విరాళంగా ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు బెంగుళూరుకు చెందిన సుయూగ్ వెంచర్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ విరాళం అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ యతీశ్ సూరినేని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆదివారం కలిసి విరాళం చెక్కును అందచేశారు.