అమరావతి : కర్నూలు(Kurnool) జిల్లా ఆలూరు మండలం హత్తి బెళగల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది కూలీలు గాయపడ్డారు. మండలంలో హులేబీడు గ్రామానికి చెందిన 20 మంది కూలీలు ఒకే ఆటోలో చిప్పగిరి మండలంలో కూలీ పనులకు బయలు దేరారు. హత్తి బెళగల్ వద్దకు రాగానే ఆటో బోల్తా (Auto Overturn) పడడంతో అందులో ఉన్న కూలీలందరికీ గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి (Critical) విషమంగా ఉండడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు(Police Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.