తిరుమల : ఆపద మొక్కులవాడిగా పేరుగాంచిన తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఓ ఉద్యోగి బంగారాన్ని దొంగిలిస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. తిరుమల (Triumala) , తిరుపతి దేవస్థానం పరిధిలో ఆయా ప్రాంతాల్లో నెలకొల్పిన హుండీలను ఒకేసారి పరకామణికి తరలిస్తారు.
ఇదే సమయంలో బ్యాంకు ఉద్యోగి ( Bank Employee ) పెంచలయ్య వందగ్రాముల బంగారం బిస్కెట్ (Gold biscuit) ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్ను తరలిస్తుండగా పట్టుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.
శ్రీవారి ఆలయ పరకామణి చోరీ ఘటనపై టీటీడీ అదనపు ఈవో (TTD EO ) వెంకయ్య చౌదరి స్పందించారు. హుండీని తలరించేటప్పుడు ఒప్పంద ఉద్యోగి బంగారం బిస్కెట్ను దొంగలించాడని తెలిపారు. శ్రీవారి పరకామణి టీటీడీ విజిలెన్స్ (Vigilance officials) నిఘాలో ఉంటుందని, ప్రతిసారి హుండీలను రెండుసార్లు తనిఖీలు చేస్తామన్నారు. తనిఖీల్లో బంగారు బిస్కెట్ బయట పడిందని వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారని తెలిపారు.