తిరుపతి : ఏపీలో ఎన్నికలు ముగిసినా ప్రత్యర్థుల మీద పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి (Tirupati) లో మంగళవారం చంద్రగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పులివర్తి్ నాని(Pulivarthi Nani) కారుపై వైసీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. పద్మావతి మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వెళ్తున్న నాని, అతడి గన్మెన్ (Gunmen)పై దాడులకు పాల్పడ్డారు. నాని కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో ముందు జాగ్రత్తగా గన్మెన్ గాల్లోకి రెండు రౌండ్ల (Two Rounds) కాల్పులు జరపడతో వైసీపీ మూకలు అక్కడి నుంచి పారిపోయారు. దాడికి నిరసనగా నాని, అనుచరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.