అమరావతి : వాలెంటైన్స్ డే ( Valentine Day ) రోజున ఓ ప్రేమోన్మాది యువతిపై యాసిడ్తో దాడి (Acid Attack ) చేయడం సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లాలోని (Annamaiah District) గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23) అనే యువతిపై ప్రేమోన్మాది గణేష్ కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమె స్థానికులు మదనపల్లెలోని ( Madanpalle ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు (Banglore) తరలించారు.
గౌతమికి ఏప్రిల్ 29న పెళ్లి నిశ్చయమైంది. ఈ నేపథ్యంలోనే గౌతిమి పెళ్లిపై గణేష్ కోపం పెంచుకుని దాడికి పాల్పడ్డాడు. నిందితుడు మదనపల్లె అమ్మ చెరువుమిట్టకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. మదనెపల్లే జడ్జి బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu) , హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు.
నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బాధితురాలికి ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని సీఎం వెల్లడించారు. ఘటనపై వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.