అమరావతి : అభం,శుభం తెలియని చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. లైంగికదాడులను అరికట్టేందుకు పోక్సో చట్టాలను తీసుకొచ్చినా దారుణాలు ఆగకపోతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ కలకలం రేపుతుంది.
జిల్లాలోని గోపవర మండలం రాచాయపేటలో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై సామాహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్లో చిత్రీకరించి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడింది పది, ఇంటర్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.