Arrest | పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రీతు సాహు మృతి కేసులో నలుగురు అరెస్టు
Arrest | ఏపీలోని విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని రీతు సాహు (Ritu Sahu) మృతి కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అమరావతి : ఏపీలోని విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని రీతు సాహు (Ritu Sahu) మృతి కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని పేర్కొంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రాథమికంగా విచారణ జరిపిన పోలీసులు హాస్టల్ యజమాని లక్ష్మి, వార్డెన్ సూర్యకుమారి, సిబ్బంది సూర్యకాంత్, రామేశ్వర్‌ను అరెస్టు (Arrest) చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరికి 14 రోజుల పాటు రిమాండ్(Remand) విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి (Bengal Student) చెందిన రీతు సాహు నీట్ పరీక్షకు (NEET Exam) సిద్ధం కావడానికి విశాఖలోని ఓ ప్రముఖ విద్యా సంస్థలో చేరి హాస్టల్లో చదువుకుంటుంది. జులై 14 రాత్రి 10:30 గంటల సమయంలో హాస్టల్ భవనంపై నుంచి పడడంతో తీవ్రగాయాలపాలై చికిత్సపొందుతూ జులై 16న మృతి చెందింది. అయితే బిల్డింగ్ పైకి వెళ్ళినప్పుడు ఓ డ్రెస్, కింద పడిన సమయంలో మరొక డ్రెస్ ఒంటిపై ఉన్నట్టు సీసీ ఫుటేజీలో కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసును సక్రమంగా దర్యాప్తు చేయడం లేదంటూ మృతురాలి తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి సైతం జోక్యం చేసుకోవడంతో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసుపై విశాఖ సీపీ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ విద్యార్థిని మృతి హత్య, ఆత్మహత్య అనేది ఫోరెనిక్స్ రిపోర్టు ఆధారంగా తేలుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

