అమరావతి : వినయోగదారులను మోసం చేయడంతో పాటు వారి వద్ద నుంచి రూ.5కోట్లు వసూలు చేసి పారిపోయిన పప్పుల చిట్టీ స్కామ్ ప్రధాన సూత్రదారి సబ్బేళ్ల రామారెడ్డిని బుచ్చయ్యపేట పోలీసులు అరెస్ట్చేశారు. సంక్రాంతికి వంట సరుకుల పేరుతో చిట్టీల వ్యాపారం నిర్వహించి చోడవరం, నర్సీపట్నంకు చెందిన ప్రాంతాల్లో ఏడువేల మంది వినియోగదారులను మోసం చేసిన కేసులో అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
సుమారు రూ.5కోట్లు వసూళ్లు చేసి పారిపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలించి అరెస్ట్ చేశారు. దీంట్లో భాగంగా ఈ కేసులో మరో నిందితుడు ఎలియాబాబును ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. వినియోగదారులను మోసం చేసిన కేసులో రామారెడ్డి, ఎలియాబాబు ఇద్దరూ నిందితులేనని పోలీసులు వెల్లడించారు.