అమరావతి : ఏపీ పోలీసులకు ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాగలక్ష్మి అధికార వైసీపీ నాయకుడు వేధింపులకు ఆత్మహత్య చేసుకుందని ట్విటర్లో ఆరోపించారు.
రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదని నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో రుజువైందని అన్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. స్వయంగా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపైన కూడా చర్యలు తీసుకోని ఈ వ్యవస్థను ఏమనాలని తెలిపారు. నాగలక్ష్మి ఆత్మహత్య కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు.