హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ప్రయాణికుల కోసం తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను 1000కి పెంచినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. 300 కిలోమీటర్ల దూరంపైబడిన నగరాల నుంచి వచ్చే బస్సులకు 80శాతం టికెట్లను, ఆ లోపు దూరం నుంచి వచ్చే బస్సులకు 20శాతం టికెట్లను కేటాయించినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఈ నెల 15 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రయాణ టికెట్లతో పాటు దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవాలని చెప్పారు. అదనపు కోటా టికెట్లను www.apsrtconline.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు.