అమరావతి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీడలో వైసీపీ కాలం వెల్లదీస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి స్వప్రయోజనాలకు ఆ పార్టీ నాయకులు పాకులాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నా వాటి గురించి మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు.
ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతివ్వడం వెనుక ఉద్దేశ్యం ప్రాపకం కోసమేనని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిఘా, దర్యాప్తు సంస్థలను పక్కాగా ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నారని విమర్శించారు.