AP news | గుర్రపు పందేలకు అలవాటు పడి బ్యాంకుకే కన్నం.. నిందితుడి అరెస్ట్, భారీగా నగదు స్వాధీనం
AP news | జల్సాలు, గుర్రపు పందేలాకు అలవాటు పడిన ఓ వ్యక్తి బ్యాంకుకే(Bank) కన్నం వేసి కటకటాల పాలయ్యాడు.
AP news | జల్సాలు, గుర్రపు పందేలాకు అలవాటు పడిన ఓ వ్యక్తి బ్యాంకుకే(Bank) కన్నం వేసి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని మడకశిర(Madakashira) కెనరా బ్యాంకులో(Canara bank) సుందరేష్ ఆచారి అప్రైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. విలాసాలకు అలవాటు పడిన అతను తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. సుందరేష్ 872 గ్రాముల నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రూ.70.66 లక్షలు మోసం చేసినట్లు జులై 24న బ్యాంకు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడని వైబీహళ్లి క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. సుందరేష్ను విచారించగా..బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో పరిచయం పెంచుకొని మాయ మాటమాటలతో వారి ఖాతాల్లో నకిలీ బంగారు రుణాల ఖాతాలు సృష్టించాడు. వచ్చిన సొమ్ముతో బెంగళూరు వెళ్లి జల్సాలకు పాల్పడే వాడు. నిందితుడి నుంచి రూ.30.20 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఈ నేరంలో ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

