అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను (Congress) కిందిస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తలను (Coordinators) నియమించింది. ఇందులో భాగంగా రెండో విడతలో 50 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించినట్లు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు (AP PCC) వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించారు.
త్వరలో మరికొన్ని నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల పేర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. కొత్తగా నియామకమైన కోఆర్డినేటర్లు ప్రతి ఒక్కరు ప్రజలతో సత్సబంధాలు మెరుగుపరుచుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు.
ఆలూరు నియోజకవర్గానికి చిప్పగిరి లక్ష్మినారాయణ, ఉరవకొండకు వై. మధుసూదన్ రెడ్డి, గుంతకల్‌కు కావలి ప్రభాకర్, తిరుపతికి రాంభూపాల్ రెడ్డి, చిత్తూరుకు టికారాం, కుప్పంకు ఏ గోవిందరాజులు, గజపతినగరంకు చిత్రాది దుర్గాప్రసాద్, విజయనగరానికి ఎడ్ల పైడిరాజు, బాపట్లకు గంట అంజిబాబు, చిలకూరిపేటకు రాధకృష్ణను కోఆర్డినేటర్లుగా నియమించినట్లు వెల్లడించారు.