AP Weather | ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ మధ్య ఆనకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఇది కేంద్రీకృతమైంది. 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రా, దక్షిణ చత్తీస్గఢ్ మీదుగా వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో అక్కక్కడ పిడుగులో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాగల 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆరెంజ్ అలర్జ్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.