Heavy Rains | ఏపీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.
రానున్న ఐదు రోజుల పాటు కోస్తాంధ్రలోఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి నుంచి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
భారీ వర్షాల నేపథ్యంలో చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్గింగ్ల వద్ద ఉండరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.