అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈనెల 22 వ తేదీన ఓటర్ల (Voters) తుది జాబితాను విడుదల చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది . ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లున్నారని , ఇందులో పురుష(Male voters ) ఓటర్లు 1.99 కోట్లు కాగా మహిళా ఓటర్లు (Female Voters) 2.07 కోట్లని స్పష్టం చేసింది . ఇందులో మహిళా ఓటర్లు అధికంగా ఉండడం శుభపరిణామమని వెల్లడించింది.
రాబోయే ఎన్నికల్లో 5.8 లక్షల మందికి ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. రాష్ట్రంలో వంద సంవత్సరాలు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారని, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7లక్షల 88 వేలమంది ఉన్నారని ఈసీ తెలిపింది. ఓటర్ల నమోదుపై అన్ని పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ఓటర్లు నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది.