AP TET 2024 | ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాలను cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని నారా లోకేశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించగా.. 3,68,661 మంది హాజరయ్యారు. వీరిలో 1,87,256(50.79 శాతం) మంది అర్హత సాధించారని మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని తెలిపారు.
Aptet Results