
తిరుమల : ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రవిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకున్నతర్వాత పర్యటన కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు శ్రీవారి సేవలో పాల్గొన్నానని చెప్పారు. ఎస్టీ కమిషన్ ఏర్పడిన మొదటిసారి ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారు.
చిత్తూరు జిల్లాలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్ అమలుపై పర్యవేక్షించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్టీ కమిషన్ సభ్యులు, ఆదివాసీ బిడ్డలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నా”అని ఆయన పేర్కొన్నారు.