Red Book | రెడ్‌బుక్ వేధింపులు సచివాలయ ఉద్యోగులనూ వదలడం లేదని వైసీపీ ఆరోపించింది. గత 10 రోజులుగా సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులు నారా లోకేశ్ రెడ్ బుక్ వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే పలువురు మిడిల్ లెవల్ అధికారులను కూటమి ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేసిందని పేర్కొంది. కులం, మతం ఆధారంగా ఎంఎల్‌వోలను జీఏడీకి బదిలీ చేశారని చెప్పింది. ఈ మేరకు ఆరుగురు ఎంఎల్‌వోలను జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని వివరించింది.
నారా లోకేశ్ రెడ్ బుక్ వేధింపుల పట్ల ఏపీ సచివాలయ ఉద్యోగులు మండిపడ్డారు. ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చారని విమర్శించారు. సమాచార శాఖలోనూ ఇద్దరు అధికారులను అదే తరహాలో బదిలీ చేశారని ఆరోపించారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సెక్రటరీకి అటాచ్ చేస్తూ ఆదేశాలిచ్చారని మండిపడ్డారు.