అమరావతి: ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు (AP Police Constable Results) విడుదలయ్యాయి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ slprb.ap.gov.inలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ఫలితాలు, స్కోర్ కార్డులు చూడవచ్చు. జూలై 29న ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో అవి వాయిదాపడ్డాయి.
ఆంద్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ (సివిల్), ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ- పురుష) 6100 పోస్టుల భర్తీకి సంబంధించి 2022, జనవరిలో ప్రిలిమినరీ, అక్టోబర్‌లో తుది పరీక్షలు నిర్వహించారు. అయితే న్యాయ వివాదాల కారణంగా ఫలితాల విడుదల ఆలస్యమైంది. రెండు వారాల క్రితమే అభ్యర్థులకు ర్యాంకు కార్డులను కూడా విడుదల చేశారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
https://slprb.ap.gov.in/PCFWTRES/FWEPCRESULTS.aspx