అమరావతి : ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు (AP NGO) భారీ విరాళాన్ని ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతంలో ఒక రోజు బేసిక్ పే (Basic Pay) ద్వారా రూ. 120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు(Employees) , ఉపాధ్యాయులు (Teachers) పింఛన్ల నుంచి ఈ విరాళం అందజేస్తామని జేఏసీ నాయకులు కె.వి.శివారెడ్డి, విద్యాసాగర్ సీఎం చంద్రబాబుకు అంగీకార పత్రం అందజేశారు.
వరద బాధితుల కోసం ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ. 25 లక్షలు అందజేసింది. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) భారీ విరాళాన్ని (Donations) ప్రకటించారు. సుమారు రూ. 6 కోట్లను ప్రకటించారు. ఏపీలోని 400 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు తనవంతుగా లక్ష రూపాయల చొప్పున రూ. 4 కోట్లు అందజేస్తానని ప్రకటించారు. ఏపీకి, తెలంగాణకు రూ. కోటి చొప్పున సీఎం సహాయనిధికి పంపిస్తానని తెలిపారు. హెరిటేజ్ ఫుడ్ అధినేత నారా భువనేశ్వరి రెండు తెలురు రాష్ట్రాలకు రూ. కోటి చొప్పున ప్రకటించారు.