AP News | రాష్ట్రాన్ని నాశనం చేయాలన్నదే వైఎస్ జగన్ సంకల్పం : కేంద్ర మంత్రి
AP News | వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన విధ్వంసాన్ని భరించలేకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని దారుణంగా ఓడించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్ ఏకైక సంకల్పమని ఆరోపించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే సత్తా లేని జగన్ కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.
AP News : వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన విధ్వంసాన్ని భరించలేకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని దారుణంగా ఓడించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్ ఏకైక సంకల్పమని ఆరోపించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే సత్తా లేని జగన్ కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.
ప్రశ్నించడానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఎందుకు రావడం లేదని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. తన పార్టీ నేతలకు ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసమే ఆయన మాట్లాడుతున్నారని, కానీ ఆయన చేస్తున్న విమర్శల్లో ఏ ఒక్కదానికి నేటికీ ఆధారాలు చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రాకూడదు, ఏ ఒక్కరూ బాగుపడకూడదనే దుర్బుద్ధితోనే జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి కొండంత అండగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దానిని ఖచ్చితంగా సాధించి తీరతామని ధీమా వ్యక్తంచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

