AP News | గౌరవమైన పోలీసు వృత్తిలో ఉన్న ఓ హోంగార్డు అనుచితంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లల ముందే ఓ మహిళతో కలిసి అసభ్యకరంగా డ్యాన్సు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సదరు హోంగార్డుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన హోంగార్డు అజయ్‌కుమార్.. కంకిపాడు రూరల్ సీఐ దగ్గర డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఓ స్కూల్లో కార్యక్రమానికి వెళ్లిన అజయ్ కుమార్.. ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే ఈ సందర్భంగా ఆ యువతితో అశ్లీలంగా స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు చేరడంతో అజయ్‌కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీసు శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.