హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్‌కుమార్ ప్రసాద్‌ను నియమితులయ్యారు. శుక్రవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, మధ్యాహ్నమే ఆయన బాధ్యతలను స్వీకరించారు. గంటల వ్యవధిలోనే సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)లోని ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీలకు ఆదేశాలు జారీచేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ్ భరత్‌గుప్తాను జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.