హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మం డలం చెరుకువాడలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ తీవ్రంగా గాయపడగా, దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. భీమవరం నుంచి ఏలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాశ్ భీమవరం దవాఖానకు వెళ్లి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం పీడీఎఫ్ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ గెలుపొందారు. ఆయన మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి సంతాపం ప్రకటించారు.