అమరావతి : ఏపీలో మహిళల అదృశ్యంపై మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan ) మణిపూర్ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana ) ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రానికి సలహాలు ఇవ్వొచ్చని సూచించారు.
గురువారం శ్రీశైల దేవస్థానం మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. యాప్ ద్వారా ఆర్జిత సేవలు, వసతి గదులు బుక్ చేసుకునే సదుపాయం, గంగా సదన్ లోని సెంట్రల్ రిసెప్షన్ ను నంది సర్కిల్ వద్ద ఉన్న టూరిస్ట్ ఎమినిటీస్ సెంటర్లోకి మార్పు, నూతన సెంట్రల్ రిసెప్షన్లో కౌంటర్లను ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ఏపీలో మహిళలు అదృశ్యంపై పవన్ కల్యాణ్ ఏ ఆధారంగా విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీ స్థానం ఏంటో ఏపీ బీజేపీ చీఫ్గా నియమితులైన పురందేశ్వరి తెలుసుకోవాలని ఆయన సూచించారు. నియోజకవర్గాల్లో సరిగ్గా పనిచేయని వారు, గ్రాఫ్ సరిగా లేని వారు వైకాపా పార్టీ విడిచి వేరే పార్టీలకు వెళ్లడం సహజమని, వైసీపీ వీడి ఇతర పార్టీలోకి వెళ్లే ఎమ్మెల్యేలకు ఆత్మహత్య సాదృశ్యమేనని పేర్కొన్నారు.