Minister Dola | ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన మంత్రిని ఓ ఎద్దు నెట్టడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదివారం వెళ్లారు. తిరునాళ్ల సందర్భంగా కొనుగోలు చేసిన నూతన ఎడ్ల బండిని ప్రారంభించాలని టీడీపీ నాయకులు మంత్రిని కోరారు. వారి కోరిక మేరకు ఎడ్లబండిని ప్రారంభించిన సందర్భంగా మంత్రితో అక్కడ ఉన్న వాళ్లు ఫొటో దిగారు. అదే సమయంలో. డీజే ఆపరేటర్లు పెద్ద ఎత్తున సౌండ్లు పెట్టారు. దీంతో బెదిరిపోయిన ఎడ్లు బండిని ముందుకు లాక్కొని వెళ్లాయి. ఆ హఠాత్పరిణామంతో అదుపుతప్పి మంత్రి ఒక్కసారిగా కిందపడిపోయారు.
మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి తృటిలో తప్పిన ముప్పు – పోలేరమ్మ తిరునాళ్లలో పాల్గొన్న మంత్రి స్వామి – మంత్రి స్వామి వైపు దూసుకెళ్లి ఢీకొన్న ఎద్దులు – వెంటనే అప్రమత్తమై ఎద్దులను తప్పించిన స్థానికులు – ఎద్దులు ఢీకొట్టడంతో మంత్రి స్వామికి గారికి స్వల్పగాయాలు
Get well soon!! pic.twitter.com/zrWhZyaVvN— CBN NBK NTR 🚲 (@cbn_nbk_ntr) July 28, 2024
అలా బోర్లా పడిన మంత్రి వీపుపై ఎద్దు తన ముందు కాళ్లతో తొక్కింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, స్థానిక నాయకులు ఎద్దును అడ్డుకుని మంత్రిని అక్కడి నుంచి తప్పించారు. స్వల్పంగా గాయపడిన మంత్రిని వాహనంలో ఒంగోలులోని ఇంటికి తీసుకెళ్లారు. వైద్యులు అక్కడికి చేరుకుని చికిత్స అందించారు. కాగా, మంత్రికి పెను ప్రమాదం తప్పడంతో అక్కడున్న భక్తులు, టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.