AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని సులోచన ఫామ్‌హౌజ్‌లో సోదాలు నిర్వహించిన ఏపీ సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏ40 వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారుల ఈ సోదాలు నిర్వహించారు.
ఏ1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్లుగా వరుణ్, చాణక్య అంగీకరించారు. ఈ నేపథ్యంలో వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఏపీ సిట్ అధికారులు బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్‌హౌస్‌లో సోదాలు నిర్వహించారు. 12 బాక్సుల్లో దాచిపెట్టిన రూ.11కోట్లను గుర్తించారు. ఆ మొత్తాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ డబ్బును 2024 జూన్‌లో దాచినట్లుగా అధికారులు వెల్లడించారు. నగదు లభ్యమైన సులోచన ఫామ్‌హౌజ్ ప్రొ.బాల్‌రెడ్డి పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది.