అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు చివరిరోజు అధికార వైసీపీ తీసుకొచ్చిన బిల్లుపై శాసనసభ, మండలి సమావేశాల్లో గందరగోళం ఏర్పడింది. ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పుపై టీడీపీ సభ్యులు ఉభయసభల్లో ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీలో స్పీకర్, మండలిలో పోడియం పొడియం వద్దకు దూసు కొచ్చిన సభ్యులు ప్లక్లార్డులతో నిరసన తెలిపారు. పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయడంతో స్పీకర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. స్పీకర్ రక్షణగా వైసీపీ మంత్రులు పోడియం వద్దకు రావడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.