AP IAS | ఏపీ ఐఏఎస్ కేడర్ బలాన్ని 239 నుంచి 259కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం సీనియర్ డ్యూటీ పోస్టులను 130 నుంచి 141కి పెంచింది. వీటిలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి పోస్టుల సంఖ్య రెండు నుంచి మూడుకు చేరాయి. ఏపీలో జిల్లాల సంఖ్య పెరగడంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పోస్టులను 13 నుంచి 26కి పెంచింది. ఐటీడీఏ పీవో, డీఆర్డీఏ, జడ్పీ సీఈవో పోస్టుల సంఖ్యను 8 నుంచి 5కి, డైరెక్టర్ పోస్టుల సంఖ్యను 28 నుంచి 20కి తగ్గించింది.