Srisailam | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీశైలం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులకు ఆలయ మర్యాదలతో అర్చక, వేద పండితులతో కలిసి దేవస్థానం ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామి అమ్మవార్లను జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు దర్శించుకున్న తర్వాత అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చక వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించారు. అటుపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులకు దేవస్థానం ఈవో పెద్దిరాజు శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదం, జ్ఞాపికలను అందించారు.